
దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలి
జనగామ రూరల్: సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చే దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం విభాగా న్ని వైద్యాధికారులతో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆస్పత్రిని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. దివ్యాంగులు యూడీఐడీ పొందేందుకు వచ్చే దివ్యాంగులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంట వైద్య కళాశాల పర్యవేక్షకులు రాజలింగం, గోపాల్‌రావు, సిబ్బంది ఉన్నారు.
పురాతన దేవాలయాల పరిరక్షణకే ఽ
దూప దీప నైవేద్యం
జనగామ రూరల్: పురాతన దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం ధూపదీప నైవేద్యం పథకాన్ని అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ధూప దీప నైవేద్యం పథకానికి దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ 800 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయాలను గుర్తించి ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేయాలని డీడీఎన్ త్రిసభ్య కమిటీ సభ్యులను ఆదేశించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు, త్రీ సభ్య కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌ను సన్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్