
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్‌లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్‌లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 మంది స్నేహితుల కుమార్తెలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించారు.