
రోజు 13 కిలోమీటర్లు నడిచి వెళ్లే వాడిని..
పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978 నుంచి 1983 వరకు చదువుకున్నా ను. ఆ రోజుల్లో రోడ్లు, రవాణా సౌకర్యం ఉండేది కాదు. రోజూ సమయపాలన పాటిస్తూ వల్మి డి నుంచి 30 మంది స్నేహితులతో కలిసి 13 కిలోమీటర్లు నడిచేటోళ్లం. ప్రభుత్వ పాఠశాల నేర్పించిన క్రమశిక్షణే ఈ స్థాయికి ఎదిగేలా చేసింది.
– పోతుగంటి నరసయ్య, ఎంఈఓ
బడికి తప్పించే వాళ్లం కాదు
జఫర్‌గఢ్: స్థానిక ఉన్నత పాఠశాలలో 1973 సంవత్సరం పదో తరగతి పూర్తి చేశాను. ఉపాధ్యాయులంటే భయం, గౌర వం ఉండేది. కరెంటు సౌకర్యం లేకున్నా గుడ్డి దీపాల వెలుతురులో తల్లిదండ్రులు చదివించే వారు. సర్కారు బడిలో చదవడంతోనే ఈ పొజిషన్‌కు చేరుకున్నా. ఆ అభిమానంతోనే జఫర్‌గఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా మార్చినం. – డాక్టర్ సాంబశివరావు,
ఆరోగ్యశాఖ మాజీ డైరెక్టర్
బాయికాడికి పొమ్మంటే బడికి పోయేది
లింగాలఘణపురం : నాన్న బాయికాడికి పోయి పొలం దున్నమంటే నేను బడికి పోయేవాడిని. ఇష్టంతో చదువుకున్నాను. ప్రస్తుతం ఉస్మాని యా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు బడికి పోకపోతే మార్కులు తక్కువ వస్తాయనే భయంతో నాన్న బాయికాడికి పొమ్మన్నా స్కూల్‌కు వెళ్లేది. అప్పట్లో చదువుకోవడానికి ఇప్పటిలా సౌకర్యాలు లేవు. పుస్తకాలు కొనుక్కోవడానికి పైసలు లేక ఇబ్బంది పడేది.
– బుట్టిరెడ్డి రవీందర్‌రెడ్డి, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, లింగాలగణపురం
●

రోజు 13 కిలోమీటర్లు నడిచి వెళ్లే వాడిని..

రోజు 13 కిలోమీటర్లు నడిచి వెళ్లే వాడిని..