జనగామ: తెలంగాణ ప్రభుత్వం పెంచిన లిక్కర్ ధరలు.. మద్యం దుకాణాలకు కాసులు కురిపించా యి. పాత స్టాక్.. పాత ధరలకే విక్రయించాలని ప్ర భుత్వం సర్క్యులర్ జారీ చేసినా.. వ్యాపారులు పెడచెవిన పెట్టారు. ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన లిక్కర్ దుకాణాలు.. మధ్యాహ్నం 12.30 గంటలు దాటినా మూసే ఉంచారు. డిపోల ద్వారా నూతన బిల్లింగ్ పూర్తయ్యే వరకు కొన్ని చోట్ల షాపులు తెరవలేదు. లిక్కర్ దుకాణాలకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు షాపులు మూసి ఉండడంతో ఆందోళనకు గురి కాగా, పాత స్టాక్‌ను కొత్తగా అమ్ముకునేందుకే ఇలా చేశారనే ప్రచారం జరిగింది. ఇదంతా ఎకై ్సజ్ శాఖ చూసీ.. కూడా చూడనట్టు వ్యహరిస్తూ మద్యం దుకాణాదారులకు సహకారం అందించిందనే ఆరోపణలు బాహాటంగానే వినిపించాయి.
మద్యం ప్రియుల జేబులు లూటీ..!
రాష్ట్ర ప్రభుత్వం క్వార్టర్‌పై రూ.10, ఆఫ్ రూ.20, ఫుల్ బాటిల్ లిక్కర్‌పై రూ.40 వరకు పెంచుతూ ఈ నెల 18వ తేదీన జీఓ జారీ చేసింది. వైన్స్‌లో ఉన్న పాత స్టాక్‌కు కొత్త రేట్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఓల్డ్ స్టాక్‌పై ఎంతో కొంత వెనకేసుకోవాలనే ఆలోచనతో దుకాణాదారులు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలు దాటిన తర్వాత వైన్స్ తెరిచి కొత్త ధరలతో స్టాక్ విక్రయించారు. ఇదేంటని మద్యం ప్రియులు నిలదీస్తే ‘ఎకై ్సజ్ అధికారులు వచ్చారు.. పాత స్టాక్ వివరాలు రాసుకున్నారు.. వీటికి చలానా రూపంలో అదనపు డబ్బులు వసూలు చేస్తారు’ అని చెప్పి కొత్త ధరలకు లిక్కర్ విక్రయించారు. కానీ, ప్రభుత్వం పాత స్టాక్ పూర్తయ్యే వరకు ఓల్డ్ రేట్లు మాత్రమే తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎకై ్సజ్ అధికారుల బూచీ చూపెడుతూ.. మద్యంవ్యాపారులు మద్యం ప్రియుల జేబులను ఖాళీ చేశారు. ఇదిలా ఉండగా లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం 18వ తేదీ సాయంత్రం సర్క్యులర్ జారీ చేయగా, అదే రోజు జిల్లాలోని చాలా చోట్ల గంట ముందుగానే వైన్స్ మూసివేశారు. కాగా, జిల్లాలో 47 మద్యం దుకాణాలు ఉండగా, రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. పాత ధరలపై కొత్త రేట్లతో విక్రయించడంతో సుమారు రూ.5లక్షల వరకు మద్యం బాబులపై అదనపు వడ్డన పడింది.
కానరాని ఎకై ్సజ్ శాఖ
ధరల పెంపు సమయంలో విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ నిఘా ఉండాలి. దుకాణాలు ఎప్పుడు తెరుస్తున్నారు.. అదనపు ధరలు తీసుకుంటున్నారా.. లేదా.. అని చెక్ చేసుకోవాలి. పాత స్టాక్ పాత ధరలకే విక్రియించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. జిల్లాలో ఎవరూ పాటించలేదు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్ శాఖ నిమ్మకుండిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్ మధ్యాహ్నం 12.30 గంటల వరకు తెరుచుకోకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికితోడు ఏ ఒక్క వైన్స్ వద్ద కూడా కొత్త ధరలు సూచించే ఫ్లెక్సీ కన్పించకపోవడం గమనార్హం.
సమీపించినా మూసి ఉన్న మద్యం దుకాణం
ధరలు పెరగడంతో ఆలస్యంగా తెరిచిన వైన్స్
మద్యం ప్రియుల మండిపాటు
కనిపించని ధరల పట్టిక
పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు
పాత స్టాక్.. కొత్తధరలు
పాత స్టాక్.. కొత్తధరలు


