ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
జనగామ: జనగామ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఏసీ) పింకేష్ కుమార్ అన్నారు. శానిటేషన్ నిర్వహణ, కరువైన ఆహ్లాదం, చెత్తతో నిండి పోయిన రోడ్లు, అస్తవ్యస్తంగా వీధి దీపాల నిర్వహణ తదితర పట్టణ సమస్యలపై సాక్షిలో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ పింకేష్ కుమార్ స్పందించారు. బుధవారం కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏఈ మహిపాల్‌తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జనాభా పెరుగుదల, రోజురోజుకు పెరుగుతున్న అవసరాలకు కనుగుణంగా పట్టణాన్ని నలుదిక్కులా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. జంక్షన్ల అభివృద్ధి, విశాలవంతమైన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బతుకమ్మకుంట రహదారి సెంటర్‌తో పాటు ట్రాఫిక్ కంట్రోల్ రూం, బస్టాండ్ నుంచి హనుమకొండ వెళ్లే రోడ్డు, నెహ్రుపార్క్, రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహం, 60 ఫీట్ల రోడ్డును పరిశీలన చేశారు. సదరు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి, ప్రతిపాదనలు పంపించాలని కమిషనర్‌ను ఆదేశించారు.
శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి
వార్డుల్లో పర్యటించిన ఏసీ పింకేష్ కుమార్
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం


