పేదల అభివృద్ధే లక్ష్యం
జనగామ రూరల్: పేదల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్ అన్నారు. ఆదివారం జనగామ మండలం శామీర్‌పేట గోపరాజుపల్లి గ్రామాల్లో ప్రజా పాలనలో భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. సన్న బియ్యంను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లింగాల నర్సిరెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గణిపాక మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజు, జిల్లా నాయకుడు బడికే కృష్ణస్వామి, సేవాదళ్ నాయకులు సాదం మధుసూదన్, దాసరి శేఖర్, తోటపల్లి రాజిరెడ్డి, కడకంచి కొమురయ్య, ఏఎంసీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్, నర్సింగరావు, వెంకట్రామ్ రెడ్డి, వెంకట్, కనకరాజు, రంజిత్, నేతాజీ, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్
శివరాజ్


