జనగామ: జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీన తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర (హిందూ ఏక్తా యాత్ర)లో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మంచాల రవీందర్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ధర్మశాల శ్రీ వాసవీమాత దేవాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందువుల సంగటిత శక్తిని చాటి చెప్పేందుకు వీర హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజిల్లా కార్యదర్శి మోహన్ కృష్ణ భార్గవ, రంగ నరసింహరావు, శ్రీశైలం, బాల నారాయణ, గునిగంటి రా మకృష్ణ, చంద్రశేఖర్, పజ్జూరి లక్ష్మీ నర్సయ్య, లక్ష్మ ణ్, సోమిరెడ్డి, శివరామకృష్ణ, నరేందర్, మధు, రా జు, అభిషేక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.