తరిగొప్పుల: మండలంలోని అంకుషాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో బంజరుపల్లిలో నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గత 15 రోజులుగా నల్లాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. స్పందించడం లేదని, కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదన్నారు. సమీప వ్యవసాయ, బోరు బావుల వద్ద నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.