రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Mar 18 2025 8:44 AM | Updated on Mar 18 2025 8:42 AM

పాలకుర్తి టౌన్‌: ఈ నెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు పాలకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ మామిండ్ల సోంమల్లు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన గుంజె శ్రీవల్లి, లకావత్‌ నిఖిల్‌ ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు హెచ్‌ఎం పాయం శోభారాణి, ఉపాధ్యాయులు ఓరుగంటి రమేశ్‌, గుగులోతు బలరాం, అశోక్‌కుమార్‌, మరియా, జతృత, రవి, నరసింహమూర్తి, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు.

వర్గీకరణ ప్రకారమే

నియామకాలు చేపట్టాలి

జనగామ రూరల్‌: ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హక్కుల సాధనకు కలెక్టరేట్‌ వద్ద చేట్టిన దీక్షలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోట్ల మహేశ్‌, గద్దల కిశోర్‌, రాజశేఖర్‌, గువ్వల రవి, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
1
1/1

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement