
పరీక్షలు రాసి బయటకు వస్తున్న విద్యార్థులు
జనగామ రూరల్: ఈనెల 15 నుంచి ఇంటర్ మొద టి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 18 సెంటర్లలో పరీక్షలు నిర్వహించగా.. ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా జరిగాయని ఇంటర్ విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పరీక్షకు జనరల్ విభాగంలో 3,415 మందికి 3,326 మంది హాజరు కాగా 89మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 477మందికి గాను 436 మంది హాజరు కాగా 41మంది గైర్హాజరయ్యారు. మొ త్తంగా 3,892 మంది విద్యార్థులకు 3,762 మంది హాజరయ్యారు. జనగామ జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ కళాశాలలను పరీక్షల కన్వీనర్ శ్రీనివాస్, డెక్ సభ్యులు లలిత, ఆంజనేయరాజు సందర్శించారు.