
వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో మంగళవారం భక్త జనసందోహం నడుమ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు–కిరణ్మయి దంపతుల ఆధ్వర్యంలో అష్టదళ పాద పద్మారాధన పూజ వైభవంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో 108 బంగారు పుష్పాలు, వెండి పాదపద్మంను అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ స్వామివారి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, వీరన్న, భక్తులు పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, తిరుమల ఫర్టిలైజర్స్ షాపులను అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనాలు, ఎరువుల క్రయవిక్రయాలు, రైతులు కొనుగోలు చేసిన వివరాల రిజిస్టర్లను తనిఖీ చేసి రోజూవారి విక్రయాల గురించి అడిగారు. రైతులకు కొనుగోళ్ల బిల్లులను అందించాలని, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. స్టాక్ నిల్వలు, ధరల పట్టిక తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు. ఆయన వెంట డీఏఓ రామారావునాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ చంద్రన్‌కుమార్ తదితరులున్నారు.
సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ
● వీహెచ్‌పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత
జనగామ: జాగృతమైన హిందూ సమాజ చైతన్య నిర్మాణం కోసమే బాల సంస్కార శిక్షణ ఉద్ధేశ్యమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీత రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హిందూ బాల సంస్కార శిక్షణవర్గకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పిల్లలకు భక్తిగీతాలు, నీతికథలు, ఆధ్యాత్మిక విషయాలపై బోధించడం గొప్పవిషయమన్నారు. ఉత్సాహంతో వందలాది పిల్లలు తరగతులకు హాజరు కావ డం హిందూ ధర్మం గొప్పదనమన్నారు. ఈ కార్యక్రమంలో చిలువేరు హర్షవర్ధన్, మైలారం శ్రీనివాస్, ఉల్లెంగుల రాజు, ఝాన్సీ, మణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ

వైభవంగా అష్టదళ పాదపద్మారాధన పూజ