
విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులదే..
జనగామ రూరల్: విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ రిజ్వాన్ బా షా అన్నారు. మంగళవారం మండలంలోని యశ్వంతాపూర్ పరిధిలోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజుల పాటు జరగనున్న రెండో విడత జిల్లా స్థాయి ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ స్థాపనలో విద్యార్థులను ఉన్నతమైన, ఆదర్శవంతమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో అందిస్తున్న అంశాలను అర్థం చేసుకొని విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధనే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్, ఏసీజీఈ రవి కుమార్, జీసీడీఓ గౌసియా బేగం, కో ర్సు ఇన్‌చార్జ్‌లు మల్లిఖార్జున్, యాదగిరి, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే కడవెండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బడిబాట కరపత్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీఈఓ భోజన్న ఆవిష్కరించారు. పోస్టర్లతో ప్రభుత్వ పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాలను ప్రచారం చేయాలన్నారు.
జల్ శక్తి అభియాన్ పోర్టల్‌లో
వివరాలు నమోదు చేయాలి
ఈనెల 31వ తేదీ లోగా జల్ శక్తి అభియాన్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి జల్ శక్తి అభియాన్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, ఆర్‌డబ్ల్యూఎస్, భూగర్భ జల శాఖ తదితర శాఖల సమన్వయంతో జల సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, సరిత, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, డీఈఓ భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: భూసమస్యల పరిష్కారంలో వేగం పెంచుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్‌తో కలిసి డిప్యూటీ కలెక్టర్‌లు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతీ మాడ్యూల్‌లో వచ్చిన భూసమస్యల పరిష్కారానికి దిశా నిర్దేశం చేశారు. సక్సెషన్, పెండింగ్ మ్యుటేషన్, మిస్సింగ్ నంబర్, భూసేకరణ, కోర్టు కేసులు, డిజిటల్ సంతకం తదితర మాడ్యుల్‌లోని సమస్యల పరిష్కారానికి సూచనలు ఇచ్చారు. మొత్తంగా భూ భారతి సదస్సు, తహసీల్దార్ కార్యాలయంలో 1,900 దరఖాస్తులు వచ్చాయని, ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తూ వేగంగా పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌లు సుహాసిని, హనుమనాయక్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల రెవెన్యూ అఽధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా
వృత్యంతర శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులదే..