సమావేశంలో మాట్లాడుతున్న లక్ష్మి
జనగామ రూరల్: సృష్టిలోని సమస్త జీవరాశులను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకురావాలని జీవవైవిద్య ఉమ్మడి వరంగల్ చైర్మన్ నన్నపనేని లక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని ఎర్రగొల్లపహడ్ గ్రామంలో జీవ వైవిద్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి మీద ఉన్న మొక్కలు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. మానవ మనుగడకు సహకరిస్తున్నాయని అన్నారు. జీవ వైవిద్యంలో అన్ని ప్రాణులు ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మధు, అజ్మీరా స్వామినాయక్ పాల్గొన్నారు.


