కాసుల గండం | - | Sakshi
Sakshi News home page

కాసుల గండం

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

● వరదకాలువ కట్ట మరమ్మతు విషయంలో తీవ్రంగా జాప్యం చోటుచేసుకోవడంతో ఏటా వర్షకాలంలో ఇబ్బందులు తప్పడంలేదు. ● ఇప్పటికే వ్యవసాయ భూములు కోతకు గురికాగా.. వర్షాలు కురిసినప్పుడల్లా మరింతా నష్టం జరుగుతోంది. ● జగ్గాసాగర్‌ పెద్ద చెరువులోకి మాటు కాల్వ నీరు చేరడంలేదు. ● ఫలితంగా చెరువు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ● మెట్‌పల్లి మండలంలోని రామలచ్చక్కపేట శివారులో దెబ్బతిన్న వరదకాల్వ కట్ట మరమ్మతుతోపాటు జగ్గాసాగర్‌ చెరువులోకి నీరు చేరేందుకు అదనంగా మరో సూపర్‌పాసెస్‌ కోసం నిర్ణయించారు. ● నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు తయారుచేసి రూ.22.40 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ● ఆ ప్రతిపాదనలు పంపి ఇప్పటికీ మూడేళ్లకు పైగా అవుతోంది. ఇప్పటివరకు నిధుల కేటాయింపు జరగలేదు. ● ఫలితంగా మరమ్మతులు జరగక ప్రతి వర్షకాలంలో కాల్వ సమీపంలోని పంట పొలాలు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. ● ఇటీవల ఇరిగేషన్‌ ఈఎన్‌సీ రమేశ్‌బాబును కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ సమస్య గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని కోరారు.

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026

వరద

కాలువకు

మెట్‌పల్లిరూరల్‌: జిల్లాలో పారుతున్న వరదకాలువను కాసుల గండం వెంటాడుతోంది. కాలువ మరమ్మతుకు ప్రభుత్వం నిధులను విడుదల చేయడం లేదు. ప్రతిపాదనలు పంపించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ.. ఆ విషయంలో ఎలాంటి ఊసేలేదు. నాలుగేళ్ల కిందట కురిసిన భారీ వర్షాలకు మెట్‌పల్లి మండలంలో వరదకాలువ దెబ్బతినగా భారీగానే నష్టం వాటిల్లింది. వరద నీటి ఉధృతికి కట్టలు కోతకు గురయ్యాయి. పలుచోట్ల గండ్లు పడి వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు కాలేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.

భారీ వర్షాలకు సామర్థ్యానికి మించి వరదనీరు

ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కథలాపూర్‌, మేడిపల్లి, మల్యాల మండలాల మీదుగా వరదకాలువ పారుతుంది. నిర్మాణ సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి మాటుకాల్వల ద్వారా వచ్చే వరద నీరు చెరువుల్లోకి వెళ్లేలా సూపర్‌పాసెస్‌లు నిర్మించారు. మెట్‌పల్లి మండలం వెల్లుల, జగ్గాసాగర్‌ చెరువుల్లోకి నీరు వెళ్లేందుకు ఇక్కడి ప్రాంతంలో సూపర్‌ పాసెస్‌లు ఉన్నాయి. అప్పట్లో వర్షాలు కురిసిన సమయంలో సూపర్‌పాసెస్‌ల ద్వారా చెరువుల్లోకి నీరు బాగానే వెళ్లింది. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలు కురవడంతో కాలువ సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో గట్టు దెబ్బతింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో జగ్గాసాగర్‌ చెరువు కోసం నిర్మించిన సూపర్‌పాసెస్‌ సమీపంలో రామలచ్చక్కపేట శివారులో కట్ట కోతకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. అలాగే పలు చోట్ల గండ్లు పడడంతో సమీపంలోని వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. భారీ గా వచ్చిన వరదనీటి తాకిడికి పొలాల్లో మట్టి కూరుకుపోయి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.

వర్షకాలంలో తప్పని తిప్పలు

రూ.22.40 కోట్లతో ప్రతిపాదనలు..

మరమ్మతుకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం

గతంలో వర్షాలకు కొట్టుకుపోయిన కాలువగట్టు

ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం

ప్రశ్నార్థకంగా మారిన ఆయకట్టు

నిధులు మంజూరు కాలేదు

రామలచ్చక్కపేట శివారులో దెబ్బతిన్న వరదకాల్వ గట్టు మరమ్మతుకు, మరో సూపర్‌పాసెస్‌ నిర్మాణానికి సంబంధించిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. మంజూరైతే మరమ్మతు చేయడంతోపాటు కావాల్సిన నిర్మాణాలు చేపడుతాం.

– అరుణోదయ్‌ కుమార్‌,

డీఈ నీటిపారుదలశాఖ, మెట్‌పల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement