ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

కొడిమ్యాల: మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూషణ్‌ రెడ్డి, ప్యాక్స్‌ చైర్మన్‌ రాజనర్సింగరావు, సర్పంచ్‌ జీవన్‌ రెడ్డి, నాయకులు ముత్యం శంకర్‌, నారాయణగౌడ్‌, జలంధర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో ఒడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఒడ్డెర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గుంజ రేణుక, నారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించారు.

ఆర్టీసీ బస్సు ప్రారంభం

కథలాపూర్‌: మెట్‌పల్లి నుంచి వేములవాడ వరకు వెళ్లే ఆర్టీసీ బస్సును కథలాపూర్‌ మండలం పెగ్గెర్లలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ గురువారం ప్రారంభించారు. పెగ్గెర్లలో రూ.10లక్షలతో నిర్మించే మహిళాసంఘం భవనానికి భూమిపూజ చేశారు. మున్నూరుకాపు సంఘం భవనానికి రూ.5 లక్షలు, భూషణరావుపేటలో మర్రవ్వ ఆలయ అభివృద్ధికి రూ.5లక్షల ప్రొసీడింగ్‌ కాపీలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని, గతంలో బేస్‌మెంట్‌, గోడలవరకు నిర్మించుకున్న వారికి ఆర్థికసాయం అందిస్తామని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్సార్‌ ఎస్సారెస్పీ నుంచి వరదకాలువకు శ్రీకారం చుట్టి మెట్ట ప్రాంతాలకు నీరందించారని తెలిపారు. రైతులు సన్నరకం వరి సాగు చేయాలన్నారు. ఆర్టీసీ మెట్‌పల్లి డీఎం హరి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్‌ కారపు గంగాధర్‌, సర్పంచ్‌ కుంటాల లక్ష్మి, ఉపసర్పంచ్‌ పాల్తెపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అగ్నివీర్‌కు విద్యార్థి ఎంపిక

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ (ప్రభుత్వ) జూనియర్‌ కళాశాల విద్యార్థి చరణ్‌రాజు ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన సెలక్షన్స్‌లో ఎంపికయ్యాడు. అతడిని కళాశాల ప్రిన్సిపల్‌ నాగభూషణం అభినందించారు. ఈనెల 21 నుంచి మహారాష్ట్రలో ఆరునెలల పాటు ట్రైనింగ్‌ తీసుకుంటాడని, ఆర్మీలోకి వెళ్లడం అభినందనీయమని తెలిపారు. అధ్యాపకులు శ్రీహరి, స్వప్న, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

నృసింహుని సన్నిధిలో సినీ నటుడు పూజలు

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ గురువారం దర్శించుకున్నారు. ఆలయం తరఫున ఈవో శ్రీనివాస్‌ ఆయనకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, దేవస్థానం సిబ్బంది ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement