మొక్కలు నాటి సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటి సంరక్షించాలి

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

ధర్మపురి: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని తుమ్మెనాలలో గురువారం వన మహోత్సవ కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, అధిక ఉష్ణోగ్రతలు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని తెలి పారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎస్‌.దినేష్‌, డీఎఫ్‌ వో రవిప్రసాద్‌, డీఆర్‌డీవో రఘువరణ్‌, ఆర్డీవో మధుసూదన్‌, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మత్తు నివారణకు కృషి చేయాలి

జగిత్యాల: మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి అన్నారు. నషాముక్త్‌ భారత్‌ సప్తాహ్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 26 వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తుబారిన పడిన వారు సహాయం కోసం జాతీయ డీ అడిక్షన్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 14446లో సంప్రదించాలన్నారు.

వన మహోత్సవంలో మంత్రి అడ్లూరి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement