సమష్టి కృషితోనే మత్తు నిర్మూలన సాధ్యం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే మత్తు నిర్మూలన సాధ్యం

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

జగిత్యాలక్రైం: సమష్టి కృషితోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నా రు. ఎస్పీ కార్యాలయంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఈనెల 26న నిర్వహించనున్న యాంటి డ్రగ్స్‌ 3కే రన్‌ పోస్టర్‌ను ఎస్పీ గురువారం ఆవిష్కరించారు. మత్తు నిర్మూలన దిశగా ఐఎంఏ చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. యువత 3కే రన్‌లో పాల్గొనాలని కోరారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు గూడూరి హేమంత్‌, కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుధీర్‌కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్‌ పాల్గొన్నారు.

ఖమ్మంలో ధర్మపురి మున్సిపల్‌ బృందం పర్యటన

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం కార్పొరేషన్‌లో సమగ్ర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు అమలుచేస్తున్న కార్యక్రమాల పరిశీలనకు ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గురువారం పర్యటించింది. 54వ డివిజన్‌లో ఎన్టీఆర్‌ పార్క్‌ను పరిశీలించి అందులో వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంపై అభినందించారు. ఎన్నెస్పీ రోడ్డులో ఉన్న నర్సరీని పరిశీలించారు. డంపింగ్‌ యార్డ్‌లో బయో మైనింగ్‌ నిర్వహణ, డీఆర్సీసీ కేంద్రాల్లో పొడి చెత్త రీసైక్లింగ్‌ వివరాలు తెలుసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ మహేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement