వేములవాడ: భీమేశ్వర స్వామిని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక నారాయణ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందించారు.
కార్గో సేవలు అలైటింగ్
ప్లాట్‌ఫాం వైపు: ఆర్‌ఎం
విద్యానగర్(కరీంనగర్): కార్గో వినియోగదారుల క్షేమంతోపాటు వారి సౌకర్యార్థం కరీంనగర్‌లోని కార్గో, లాజిస్టిక్స్ విభాగాన్ని అలెటింగ్ ప్లాట్‌ఫామ్ వైపు మార్చినట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. బస్‌స్టేషన్ ప్రయాణికుల ప్రవేశం ద్వారం ద్వారా లోనికి వచ్చి కార్గో, లాజిస్టిక్ విభాగ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
అనుమానాస్పదస్థితిలో రైస్‌మిల్ కార్మికుడి మృతి
కోనరావుపేట: మండలంలోని కొలనూర్ శివారులో గల రైస్‌మిల్లులో ప్రేంకుమార్(20) అనే కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని సహార్సా జిల్లా సోంబరస తాలుకా లాల్పూర్‌కు చెందిన సాదా ప్రేమ్‌కుమార్ కొంతకాలంగా రైస్‌మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం గొంతులో నొప్పి ఉందని చెప్పి పడిపోయాడు. తోటి కార్మికులు ద్విచక్ర వాహనంపై సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి..
మానకొండూర్: మండలంలోని శ్రీనివాస్‌నగర్‌లో విద్యుత్‌షాక్‌తో కూలీ చనిపోయాడు. గ్రామంలోని కేజీబీవీ విద్యాలయంలో నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన పెద్దపల్లి శ్రీకాంత్(27) గురువారం భవనం వద్ద ఐరన్ రాడ్‌ను పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు 11కేవీ విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్‌షాక్ తగిలి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మట్టి టిప్పర్లు పట్టివేత
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం వద్ద మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లు, ఒక జేసీబీని గురువారం పట్టుకున్నట్లు వేములవాడ తహసీల్దార్ జయంత్ కుమార్ తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


