సిరిసిల్ల/కరీంనగర్: పానీపూరీ తిని అస్వస్థతకు గురైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్‌కు చెందిన 32 మంది పిల్లలు త్వరగా కోలుకోవాలని కేంద్ర మంర్రి బండి సంజయ్ ఆకాక్షించారు. ఎక్స్ వేదికగా గురువారస్పాయన ఘటనపై స్పందించారు. చిన్నారుల అస్వస్థత తనను ఎంతో బాధించిందన్నారు. ఇప్పటికే బాధిత పిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడానని, జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు వెల్లడించారు. చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.
మహిళపై హత్యాచారయత్నం
జగిత్యాలక్రైం: పట్టణంలోని వాణీనగర్‌లో ఓ వివాహితపై గురువారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యాచారయత్నం చేశారు. పోచమ్మవాడకు చెందిన ఓ మహిళకు వాణీనగర్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లయ్యింది. వీరికి కుమారుడు (15) ఉన్నాడు. కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండడంతో వేర్వేరుగా ఉంటున్నారు. భర్త ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం సదరు మహిళ అత్తాగారింటికి వెళ్లగా కుటుంబ సభ్యులు రానివ్వలేదు. అయినప్పటికీ ఆమె అక్కడే ఉండిపోయింది. రాత్రి కాగానే ఆమె మరిదితోపాటు మామ కలిసి ఇంటి గేట్లు వేసి ఆమైపె అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఇష్టారీతిన ఆమైపె దాడికి పాల్పడ్డారు. జాకెట్ చింపేశారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. వైద్యం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
సిరిసిల్లటౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని సిరిసిల్ల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్ చేశారు. టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం బోతిబాగోల్‌కు చెందిన మేలక్ గులాం దస్తగీర్(25) సిరిసిల్లకు చెందిన మైనర్ బాలికను ఇన్‌స్ట్రాలో పరిచయం పెంచుకున్నాడు. తరచూ మెసేజ్‌లు పెట్టగా బాలిక కూడా రిప్లై ఇస్తుంది. ఈక్రమంలో ఆమెను నమ్మించి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈనెల 14న సికింద్రాబాద్‌కు రమ్మని అక్కడి నుంచి రైలులో గుజరాత్‌లోని నడియాడ్‌కు తీసుకెళ్లాడు. తర్వాత రోజు అద్దె గది తీసుకొని మైనర్ అని తెలిసి కూడా లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి వెళ్లి పోతా అంటూ ఏడవడంతో బుధవారం ఉదయం సిరిసిల్ల పాతబస్టాండులో వదిలి వెళ్లిపోయాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపినట్లు సీఐ తెలిపారు.
● కేంద్ర మంత్రి బండి సంజయ్
● ఎక్స్ వేదికగా ప్రకటన


