పాలకుర్తి: ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన సర్కారు బడిలో వందలాది మంది సెకండరీ విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం విద్యార్థులు లేక మూతపడే పరిస్థితికి చేరింది. దీంతో సర్కారు బడిని బకించుకునేందుకు పంచాయతీ పాలకవర్గం నడుం బిగించింది. మూడురోజులుగా ప్రైవేట్ పాఠశాల బస్సులను గ్రామంలోకి అడ్డుకుంటూ వస్తోంది. దీంతో గురువారం ఒక్కరోజే 26మంది ప్రవేశాలు తీసుకున్నారు. సర్కారు బడికి పునరుజ్జీవనం పోసేందుకు ఈసాలతక్కళ్లపల్లి పంచాయతీ పాలకవర్గం చేస్తున్న కృషిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.
కేవలం 45మంది విద్యార్థులు..
ఈసాలతక్కళ్లపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక, జెడ్పీ హైస్కూళ్లు ఒకేప్రాంగణంలో ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో 20మంది, ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉన్నారు. బడి మూతపడే పరిస్థితికి చేరడంతో పంచాయతీ పాలకవర్గం స్పందించింది. సర్పంచ్ బండి శ్రీనివాస్ నేతృత్వంలో పాలకవర్గం గ్రామంలోకి వచ్చే ప్రైవేట్ పాఠశాలల బస్సులు అడ్డుకుంది. సర్కారు బడిలో కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించింది. దీంతో గురువారం ప్రాథమిక పాఠశాలలో 20మంది, హైస్కూల్‌లో ఆరుగురు విద్యార్థులు ప్రవేశం పొందారు.
మూడురోజులపాటు ప్రైవేట్ స్కూల్ బస్సుల అడ్డగింత
స్పందించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు
ఒక్కరోజులోనే 26 మంది విద్యార్థులకు ప్రవేశాలు
ఈసాలతక్కళ్లపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకత


