● ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఉత్తర విద్యుత్ పంపిణీ వ్యవస్థ(ఎన్పీడీసీఎల్) సేవలు విస్తృతం చే స్తోంది. అనేక సేవలకు శ్రీకారం చేపట్టిన విద్యుత్ సంస్థ.. మరిన్ని సేవలందించేందుకు కొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. 1912కు డయల్ చేస్తే ఎమర్జెన్సీ రిస్టోర్ టీం అక్కడకు చేరుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. అదేవిధంగా 8712481489 వాట్సాప్ బాట్ ద్వారా సమస్యను వివరించే అవకాశాన్ని సంస్థ కల్పించింది. అదే తరహాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నప్పుడు త్వరితగతిన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు హైపర్ యాక్షన్ ప్లాన్‌ను విద్యుత్ సంస్థ అమలు చేయనుంది.
అంతరాయాలు తగ్గించేందుకు..
హైపర్ యాక్షన్ ప్లాన్‌తో వర్షాకాలంలో వినియోగదారులకు అంతరాయం చాలావరకు తగ్గుతుంది. స్మార్ట్ టెక్నాలజీ–ఏఐ డ్రోన్ల అప్లికేషన్ సాంకేతికత వాడకంలో ఎన్పీడీసీఎల్ మరో అడుగు ముందుకేసి ఎస్‌సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ డేటా వ్యవస్థలను కృత్రిమ మేధ(ఏఐ)తో అనుసంధానించింది. భవిష్యత్తులో ఫీడర్లలో రాబోయే సాంకేతిక లోపాలను 1 నుంచి 3 వారాల ముందే ఏఐ గుర్తి స్తుంది. వాతావరణ మార్పులను బట్టి విద్యుత్ డిమాండ్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించి సరఫరాను మేనేజ్ చేస్తుంది. మనుషులు వెళ్లలేని అటవీ ప్రాంతాలు లేదా ఇరుకై న ప్రదేశాల్లో లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కో సం డ్రోన్ల వాడకం.. ప్రతీ సర్కిల్‌లో జీపీఆర్‌ఎస్ ఎ మర్జెన్సీ ప్రత్యేక వాహనాలు రంగంలోకి దించుతా రు. ఇందులో ఎమర్జెన్సీ రీస్టోర్ టీం మరమ్మతుకు అవసరమైన అన్ని రకాల సామగ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వీటికి జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్ ఉండడం వల్ల కంట్రోల్ రూమ్ నుంచి లొకేషన్‌ను నేరుగా మ్యాప్ చేసి సిబ్బందిని అతి తక్కువ సమయంలో సంబంధిత ప్రదేశానికి పంపుతారు.
– రాపెల్లి రవీందర్, ఎస్‌ఈ, కరీంనగర్ సర్కిల్
హైపర్ అంటే..
హెచ్: హెడ్ క్వార్టర్‌లో అప్రమత్తంగా ఉండడం, ప్రత్యేక సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, బాధ్యతల కేటాయింపు.
ఏ: ముందస్తు సమీకరణ, సమస్యలు రాకముందే క్షేత్రస్థాయికి కావాల్సిన సామగ్రి సిద్ధంచేయడం.
ఐ: వేగవంతమైన సమాచారం. విద్యుత్ ఎక్కడ నిలిచిపోయినా కచ్చితమైన సమాచారాన్ని వేగంగా సేకరించి సంబంధిత టీమ్‌లకు చేరవేయడం.
పీ: పటిష్ట వ్యూహం అమలుపర్చడం. సమాచారమందిన వెంటనే సిబ్బంది, సామగ్రి తరలించడం
ఈ: యుద్ధప్రాతిపదికన, ఫీల్డ్‌లో పనులనువేగంగా, భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయడం.
ఆర్: ఫైనల్ రిస్టోరేషన్, నిర్దేశిత సమయంలోపు వినియోగదారులకు విద్యుత్ పునరుద్ధరణ.


