‘నీట్‌’కు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’కు ఏర్పాట్లు పూర్తి

Jun 17 2026 11:53 PM | Updated on Jun 17 2026 11:53 PM

● అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

● అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

జగిత్యాల: నీట్‌ రీ ఎగ్జామ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్‌ లత తెలిపారు. పరీక్షపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా మూడు కేంద్రాల్లో 807మంది పరీక్షకు హాజరు అవుతారన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మపురి రోడ్డు, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల నాచుపల్లిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, దివ్యాంగులకు 2 నుంచి 6.20 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త అడ్మిట్‌ కార్డు తీసుకురావాలని, పాతవి చెల్లవని తెలిపారు. కేంద్రంలో ఇచ్చిన పెన్‌తోనే పరీక్ష రాయాలని, ప్రతి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రెండు అడ్మిట్‌కార్డులు తీసుకుని రావాలని, ఒకటి పరీక్ష కేంద్రంలో ఇవ్వడంతో పాటు, రెండోది తీసుకెళ్లొచ్చన్నారు.

రైస్‌మిల్లర్లు బకాయిలు చెల్లించాలి

యాసంగి 2025–26 సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, రైస్‌మిల్లర్లు బకాయిలు త్వరితగతిన చెల్లించాలని అదనపు కలెక్టర్‌ లత అ న్నారు. 2025–26 సీజన్‌కు సంబంధించి సీఎంఆర్‌ డెలివరిని ఆలస్యం లేకుండా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ పకడ్బందీగా చేపట్టాలి

స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ పకడ్బందిగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. బుధవారం అర్బన్‌, రూరల్‌ బూత్‌ లెవల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీఎల్వోలు, సూపర్‌వైజర్ల విధులు తెలుసుకోవాలని, ఈ యాప్‌ గురించి పూర్తిగా అవగాహన ఉండాలన్నారు. ప్రతి కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్యుమరేషన్‌ ఫామ్‌ను ఇంటింటికీ పంపిణీ చేయాలని, ఒక ఇంటిని మూడుసార్లు సందర్శించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement