జగిత్యాల: ఆస్పత్రుల్లో క్లీనికల్ సేవలు మెరుగుపర్చాలని, వెంటనే వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డెవలప్‌మెంట్ సొసైటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని, సమస్యలుంటే దృష్టికి తేవాలని సూచించారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, సంజయ్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్ ద్వారా అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


