మాది అంతర్గాం. జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారి – 563 నిర్మాణంలో మా ఇళ్లు, భూములు కోల్పోతున్నాం. అతి తక్కువగా నష్టపరిహారం ఇవ్వజూపుతున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆస్తికి మూడింతలు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుని న్యాయం చేయండి.
– అంతర్గాం భూ బాధితులు
అక్రమ నిర్మాణం కూల్చేయండి
రాయికల్ మండలం మైతాపూర్‌లోని రెండో వార్డులో శివనీతి రాజిరెడ్డి పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నాడు. నాలాను ఆక్రమించి ర్యాంపు నిర్మిస్తున్నాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. రాజిరెడ్డి కుమారుడు శ్రీకాంత్ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై తగిన విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని తొలగించండి. – దమ్మ లక్ష్మి, మైతాపూర్


