జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల రమ్యతో 2021లో నాకు వివాహమైంది. 2023లో బాబు జన్మించాడు. అతడు ఎదుగుదల వ్యాధి (వాస్క్యులర్ సిండ్రోమ్)తో బాధపడుతున్నాడు. ఏడాది బాబును వదిలి భార్య పుట్టింటికి వెళ్లింది. బాబును చూసుకునే వారు లేక హైదరాబాద్‌లో ఉద్యోగం వదిలేసి వచ్చాను. నా కొడుక్కి వైద్యం చేయించి ప్రాణాలు కాపాడండి.
– ముంజ సురేష్‌గౌడ్,
గంభీర్‌పూర్, కథలాపూర్ మండలం
యావర్‌రోడ్డులో అక్రమాలు తొలగించండి
జగిత్యాల పట్టణంలోని యావర్‌రోడ్డును వంద ఫీట్లకు విస్తరించడంతోపాటు యావర్‌రోడ్డు వెంట ఎలాంటి సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోగలరు.
– బీఆర్‌ఎస్ నాయకులు


