రాయికల్: అబుదాబిలోని భారత రాయబార కార్యాలయంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫస్ట్ సెక్రటరీ జార్జీ జార్జ్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాశ్ హాజరయ్యారు. డప్పుచప్పుళ్లు, జానపద నృత్యాలు, చిన్నారుల ఆటపాటతో ఆడిటోరియం మారుమోగింది. ఎందరో త్యాగఫలమే రాష్ట్రమని, అభివృద్ధికి ప్రతిఒక్కరూ ముందుండాలని ఆకాంక్షించారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశ్రీనివాస్‌రావు, ప్రతినిధులు పీజీ థామస్, లిమ్సన్, దివాకర్, వివేక్, రమేశ్, వినాయక్, సంజయ్, కిరణ్‌కుమార్, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
లైవ్ అథెంటికేషన్ కోసం హైదరాబాద్‌కు..
మెట్‌పల్లి: పట్టణానికి చెందిన మానసిక వికలాంగులైన ఇద్దరు సోదరులు సంతు, సాయిలు హైదరాబాద్‌లోని ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్నారు. వీరికి చేయూత పథకం కింద వికలాంగుల పెన్షన్ అందుతోంది. ప్రభుత్వం లబ్ధిదారుల పెన్షన్లను కొనసాగించడం కోసం ఇటీవల లైవ్ అథెంటికేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇద్దరు అక్కడి నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ప్రత్యేక చొరవ చూపి ఉద్యోగి రాకేశ్‌ను ఆదివారం వారు ఉంటున్న హాస్టల్‌కు తీసుకవెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు.
రక్తదానం చేయండి
జగిత్యాల: ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచో శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ ఆస్పత్రిలో రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంతో ఎందరో ప్రాణాలు నిలుస్తాయన్నారు. రక్తదానం చేసిన యువకులకు ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో టీవీ.సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొండగట్టులో ఏలూరు మేయర్ భర్త పూజలు
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ భర్త ముజబర్ రహమాన్ ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆగ్రహించిన మహిళలు శనివారం రాత్రి రోడ్డుపై బండరాళ్లు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా జగిత్యాల నుంచి రాయికల్, రాయికల్ నుంచి జగిత్యాల వచ్చే ఆర్టీసి బస్సులు చల్‌గల్ బస్టాండ్ వద్ద బస్సులు ఆపడం లేదని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న రూరల్ ఏఎస్సై సత్తయ్య సంఘట స్థలానికి చేరుకుని బస్సులు ఆపేలా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో బండరాళ్లు తీశారు.


