మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలే.. | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలే..

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలే..

కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ‘సాక్షి’ ఉదయం 10:30కు విజిట్‌ చేసింది. స్టాఫ్‌నర్స్‌, అటెండర్‌ మాత్రమే ఉన్నారు. కొడిమ్యాల చెందిన సురుగు మల్లవ్వ (64)ను కోతి కరవడంతో స్టాఫ్‌నర్స్‌ చికిత్స చేసి పంపించారు. 12.30గంటల ప్రాంతంలో స్టాఫ్‌నర్స్‌ ఇంటికి వెళ్లిపోయారు. వైద్యాధికారి నరేశ్‌ వారాంతపు సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. స్టాఫ్‌నర్స్‌ ఒంటిగంట వరకే అందుబాటులో ఉంటారని, అత్యవసరమైతే తిరిగి విధులకు హాజరవుతుందని పేర్కొన్నారు. 12.40 గంటలకు అటెండర్‌ ఆస్పత్రికి గేటు వేసి భోజనానికి వెళ్లాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement