జగిత్యాల: జిల్లాకేంద్రంలో ఇందిరమ్మ చీరల తరలింపు వివాదాస్పదంగా మారింది. మెప్మా కార్యాలయం నుంచి వివిధ వార్డులకు చీరలను పంపిణీ చేసేందుకు మున్సిపల్‌కు సంబంధించిన చెత్త వాహనాన్ని వినియోగించడం.. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం కింద పంపిణీ చేసే చీరలను చెత్త తరలించే వాహనాల్లో తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ వివరణ కోరగా.. ఇందిరమ్మ చీరలను ఆటోలో తీసుకుని వెళ్లాలని సూచించామని, కొందరు మున్సిపల్ వాహనంలో తీసుకెళ్లారని దృష్టికి వచ్చిందని, విచారణ చేపడతామని చెప్పారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు


