బైక్‌ పైనుంచి పడి మహిళకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ పైనుంచి పడి మహిళకు గాయాలు

Jun 14 2026 7:10 AM | Updated on Jun 14 2026 7:10 AM

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదవాశాత్తు బైక్‌పై నుంచి ఓ మహిళ కిందపడగా.. తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్‌ జిల్లా కమల్‌కోటి గ్రామానికి చెందిన సాయవ్వ శనివారం ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు కొండగట్టుకు బయల్దేరింది. ఘాట్‌రోడ్డు వద్ద బైక్‌ పైనుంచి అదుపుతప్పి కింద పడింది. సాయవ్వ తలకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది జ్యోతి, శ్రీనివాస్‌ బాధితురాలికి ప్రథమ చికిత్స చేసి, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement