జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలకేంద్రంలోని రామాలయంలో గత నెల 25న దొంగతనం చేసిన వ్యక్తితో పాటు, అతనికి సహకరించిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై గీత తెలిపారు. రామాలయం నుంచి 15తులాల రెండు వెండి కిరీటాలు గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు విచారణలో సారంగాపూర్‌కు చెందిన తునికి గంగచారిగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రామాలయంతోపాటు, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి రెండు వెండి కిరీటాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. వాటిని జగిత్యాలలోని కట్ట లక్ష్మణచారి వద్ద ముక్కలుగా చేసి.. పూదెల గణేశ్ వద్ద కరిగించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకున్నట్లు చెప్పాడు. గంగచారితోపాటు, కట్ట లక్ష్మణచారిని అరెస్ట్ చేసి వారి నుంచి 13 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


