ఫిట్నెస్ ఉండాలి
జగిత్యాలక్రైం: జిల్లాలో ఈనెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులను తరలించే బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయించుకొని ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. కాగా, జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సంబంధించి 534 బస్సులు ఉండగా, ఇప్పటి వరకు 446 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించారు. మరో 90 బస్సులు ఫిట్‌నెస్ చేసేందుకు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 15 ఏళ్లు దాటిన బస్సులకు ఫిట్‌నెస్ ఇచ్చేందుకు రవాణా శాఖ అధికారులు నిరాకరించారు.
ఫిట్‌నెస్ తప్పనిసరి
గడువులోపు ప్రైవేటు స్కూళ్ల బస్సులకు యాజమాన్యాలు విధిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాలి. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు ఆయా ప్రాంతాలకు చెందిన 446 పైగా బస్సులు ఫిట్‌నెస్ పరీక్షకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఫిట్‌నెస్ ఉంటేనే బస్సులు రోడ్లపై తిప్పాలని, నిబంధనలు అతిక్రమిస్తే సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఇలా..


