కోరుట్ల: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ‘సర్’పై బీఎల్‌ఏలకు అవగాహన కల్పించారు. ప్రతీ బీఎల్‌ఏ వద్ద పీసీసీ అందజేసిన కిట్లు ఉండాలన్నారు. ఇప్పటికే ప లు రాష్ట్రాల్లో ఎన్నిక ల సంఘం అధికారులు నిర్వహించిన సర్ కార్యక్రమాల్లో లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యాయని తెలిపారు. బీఎల్‌ఏలు శ్రద్ధ వహించి అర్హులైన వారి ఓట్లు రద్దు కాకుండా చూడాలన్నారు. అనంతరం సర్ పరిశీలకుడు రుద్ర సంతోష్ లైవ్ డెమోద్వారా అవగాహన కల్పించారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి సందయ్య, పీసీసీ జాయింట్ సెక్రటరీ బండ శంకర్, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల అధ్యక్షులు తిరుమల గంగాధర్‌గౌడ్, రైసొద్దీన్, మండల అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


