గ్రామ సమీపంలో కోళ్లఫారం వద్దు | - | Sakshi
Sakshi News home page

గ్రామ సమీపంలో కోళ్లఫారం వద్దు

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం కోనరావుపేటలో కోళ్లఫారం ఏర్పాటు విషయంలో వివాదం చోటుచేసుకుంది. గ్రామానికి కొద్దిదూరంలోనే పెద్దాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కోళ్లఫారం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కాగా.. పనులు నిలిపివేయాలని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, గ్రామస్తులు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో మెట్‌పల్లి ఎంపీవో ప్రదీప్‌కుమార్‌, ఆర్‌ఐ సంధ్యారాణి గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల ఫారం నిర్మించొద్దని, సహకరించినట్లయితే ఆందోళనకు దిగుతామని విచారణ అధికారులతో తేల్చిచెప్పారు. గ్రామానికి సమీపంలో ఫారం ఏర్పాటు చేస్తే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అదే ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల, శ్రీరాజరాజేశ్వర ఆలయం, కళ్యాణ మండపం ఉందని పేర్కొన్నారు. సర్పంచ్‌ మారు గంగారెడ్డి, ఉపసర్పంచ్‌ పరందాములు, కార్యదర్శి రాణాప్రతాప్‌, వీడీసీ సభ్యులు ఉన్నారు.

మెట్‌పల్లి మండలం కోనరావుపేట గ్రామస్తుల అభ్యంతరం

ప్రజావాణిలో ఫిర్యాదు.. విచారణ చేపట్టిన అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement