రాయికల్/మల్లాపూర్: ఇంటర్‌బోర్డు గురువారం విడుదల చేసిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో మల్లాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థిని మానాల రేవతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఏప్రిల్ 12న విడుదలైన ఫలితాల్లో 465 మార్కులతో స్టేట్ 5వ ర్యాంక్‌లో నిలిచింది. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భూమేష్ మాథ్స్–1 ఇంప్రూవ్‌మెంట్ రాయించడంతో మరో నాలుగు మార్కులు సాధించింది. మండల కేంద్రానికి చెందిన మానాల ప్రవీణ్‌కుమార్, ఉదయశ్రీ దంపతుల కూతురు రేవతి. ఉదయశ్రీ బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్‌స్కూల్‌కు చెందిన మామిడాల వైభవి 468/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. బైపీసీలో రిషిత కుమారి 426/440 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ పూదరి నర్సయ్య తెలిపారు.
ఫస్టియర్‌లో 470కి 469 మార్కులు సాధించిన రేవతి
రేవతి తల్లి బీడీ కార్మికురాలు..
అల్లీపూర్ విద్యార్థినుల ప్రతిభ


