ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రాసెసింగ్‌తో పర్యావరణానికి మేలు | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వ్యర్థాల ప్రాసెసింగ్‌తో పర్యావరణానికి మేలు

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

కోరుట్లరూరల్‌: ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు గ్రామాల్లో పరిశుభ్రత మెరుగుపడుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ తెలిపారు. మండలంలోని అయిలాపూర్‌లో రూ.40 లక్షలతో నిర్మించనున్న ప్లాస్టిక్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్లాంట్‌కు గురువారం శంకుస్థాపన చేశారు. ప్లాంట్‌ ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సర్పంచ్‌ ద్యావనపెల్లి రామకృష్ణ, ఎంపీడీవో ఒదెల రామకృష్ణ, ఉపసర్పంచ్‌ సౌమ్యక్రాంతి, ఏఈ సుచరిత్‌, అధికారులు పాల్గొన్నారు.

విద్యారంగ అభివృద్ధికి సహకారం

కోరుట్ల: విద్యారంగం అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. పాఠశాలలు, కళాశాలల్లో వసతులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వసతుల కల్పన, సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement