జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు చివరిదశలో ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం బీర్‌పూర్ మండలకేంద్రంతో పాటు నరసింహులపల్లిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. డాటా ఎంట్రీ ఆన్‌లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మిల్లుల వద్ద త్వరగా అన్‌లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్ ఉన్నారు.
వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి
కలెక్టర్ సత్యప్రసాద్


