వాన – బాలగేయం | - | Sakshi
Sakshi News home page

వాన – బాలగేయం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

వాన – బాలగేయం

చినుకు చినుకు వాన వచ్చే చల్ల చల్ల గాలితో

టపటపమని చప్పుడుతో నేల తడిసె హాయితో

బెకబెకమంటూ కప్ప గెంతుతాది గంతులు

చెట్టు చేమ ఆకులన్నీ కడిగినట్టు మెరిసెను

కాగితాల పడవలేసి కాలవలో వదిలితే

కెరటాల మీద తేలి కిలకిలమని నవ్వుతాది

గొడుగులేసి పిల్లలంతా గుంపులుగా తిరిగితే

జల్లు తాకి ముద్దు పెట్టి సందడి చేస్తాదిరా

నేలమ్మకు దాహమంతా వానదేవుడు తీరుస్తాడు

పంటలన్నీ పచ్చగా పొలమంతా నవ్వుతాది

వాన వెలిసి ఆకాశంలో హరివిల్లు వస్తే చాలు

బాల్యమంతా రంగులతో పండగల్లే ఉంటాది

మంథని మరమరాలు

బాలగేయాలు సంపుటి నుంచి

డాక్టర్‌ కోట లక్ష్మణ్‌

ప్రభుత్వ ఉపాధ్యాయులు

గ్రామం: కాకర్లపల్లి, మంథని

జిల్లా: పెద్దపల్లి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement