సెలవులు వచ్చేశాయి
పుస్తకాలు అటకెక్కాయి!
నాన్నమ్మ ఊరికి వెళ్లాం
తాతతో చేనుకు వెళ్లాం
వరి పంటను చూశాం
చెట్లకు నీళ్లు పెట్టాం
నాన్నమ్మ అప్పచ్చులు పెట్టింది
తాత జున్ను తెచ్చాడు
పేరిన నెయ్యి ఇడ్లీ తిన్నాం
తాత పక్కలో పడుకున్నాం!
అత్త వాళ్లింటికి వెళ్లాం
మామతో మెట్రో ఎక్కాం
చిన్ని బన్నీలతో ఆడాం
ప్లానెటోరియం చూశాం
అత్త ఇచ్చిన లడ్డూ తిన్నాం
మామతో చెస్ ఆడాం
పార్కుల్లో పరుగులు తీశాం
సర్కస్ చూసి ఆనందించాం
డాక్టర్ కందేపి రాణీప్రసాద్
రచయిత్రి, మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్,
సిరిసిల్ల


