రెడీ టు తహసీల్దార్‌ | - | Sakshi
Sakshi News home page

రెడీ టు తహసీల్దార్‌

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

● ఉమ్మడి జిల్లాకు నాయబ్‌ తహసీల్దార్ల కేటాయింపు ● అత్యవసర సమయంలో తహసీల్దార్‌గా కొనసాగే అవకాశం

కరీంనగర్‌ అర్బన్‌: రెవెన్యూశాఖను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే భూ భారతి పేరుతో సంస్కరణలు చేపట్టగా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తహసీల్దార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నపుడు, పరిపాలనా జోక్యం అవసరమైనపుడు, పట్టణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మండలాల్లో అదనపు పనిభారం ఉన్నప్పుడు, ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల అమలు, ఎన్నికలు, విపత్తు నిర్వహణ, తహసీల్దార్ల పనితీరు సరిగా లేకుంటే.. తదితర సమయాల్లో తాత్కలిక తహసీల్దార్లుగా నియమించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు నాయబ్‌ తహసీల్దార్లను కేటాయించగా, ఇతర జిల్లాలకు పలువురు బదిలీ అయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన క్రమంలో తహసీల్దార్లుగా నియమించనున్నారు. 18 మంది ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు వస్తుండగా 18మంది ఉమ్మడి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు.

బదిలీలు ఇలా..

● జగిత్యాల నుంచి పరాంకుశం శ్రీకాంత్‌, ఖాజా సమి అహ్మద్‌ నిజామాబాద్‌ బదిలీ అయ్యారు. కుకట్ల ఉమాపతి, రాజ్‌మహ్మద్‌ ఆదిలాబాద్‌కు, గడ్డమీది శ్రీనివాస్‌ నిర్మల్‌కు బదిలీ అయ్యారు.

●జగిత్యాలకు నిజామాబాద్‌ నుంచి వైఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, వై.గంగాధర్‌, బి.రాజశేఖర్‌, నిర్మల్‌ నుంచి జి.శ్రావణి, రహమన్‌ బదిలీపై వచ్చారు.

● రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పుట్టపాక లీలా రాణి కామారెడ్డికి, గొడుగు రజిత కరీంనగర్‌కు, బి.శ్రవణ్‌కుమార్‌ సిద్దిపేట, కె.సురేశ్‌ కుమార్‌, నిమ్మ భూపేశ్‌ మెదక్‌కు బదిలీ అయ్యారు.

● రాజన్న సిరిసిల్ల జిల్లాకు మెదక్‌ నుంచి ఎల్‌.నవీన్‌కుమార్‌, ఎన్‌.శ్రీకాంత్‌, ఎ.స్వప్న, కామారెడ్డి నుంచి జి.రవికుమార్‌ బదిలీపై వచ్చారు.

● కరీంనగర్‌ నుంచి పుప్పాల సాయికృష్ణ కామారెడ్డికి, పెద్దాపురం కళావతి, జి.కిరణ్‌కుమార్‌ సిద్దిపేట, బి.లావుడ్య ప్రేమలత మెదక్‌, కొండ్ర సుమలత రాజన్న సిరిసిల్లకు బదిలీ అయ్యారు.

● కరీంనగర్‌కు సతీశ్‌కుమార్‌, గందె శ్రీనివాస్‌, ఎస్‌.నవీన్‌కుమార్‌ సిద్దిపేట నుంచి, ఆడెపు రవి కామారెడ్డి నుంచి బదిలీపై వచ్చారు.

● పెద్దపల్లి జిల్లా నుంచి ఆర్‌.రాముడు, ఎస్‌.ఈశ్వర్‌ మంచిర్యాలకు, ఎం. తిరుపతి ములుగు, కె.ధీరజ్‌కుమార్‌, ఎన్‌.విజయ్‌ జెఎస్‌ భూపాలపల్లికి బదిలీ అయ్యారు.

● పెద్దపల్లికి జి.హరిత మంచిర్యాల నుంచి, పతంగి భాస్కర్‌, అజీముద్దీన్‌ జెఎస్‌ భూపాలపల్లి నుంచి, సిద్దం పోచయ్య, ఎ.రాములు కేబీ.ఆసిఫాబాద్‌ నుంచి బదిలీపై వచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement