కోరుట్లరూరల్: హెల్మెట్ ధరించినా.. లాక్ చేయకపోవడంతో ఓ ప్రైవేట్ లెక్చరర్ ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని సంగెం గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్ (47) మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం కళాశాలకు వెళ్లి కోరుట్ల వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కోరుట్ల శివారులోని పెద్దగుండు సమీపంలోకి రాగానే మెట్‌పల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ బైక్‌పైనుంచి ఎగిరిపడ్డాడు. శ్రీనివాస్ హెల్మెట్ ధరించినప్పటికీ లాక్ వేసుకోకపోవటంతో హెల్మెట్ ఎగిరిపోయింది. శ్రీనివాస్ తల వెనక భాగంలో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ ఢీకొని వృద్ధుడు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఎల్లారెడ్డిపే ట మండలం రాజన్నపేటలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన నమిలికొండ నర్సయ్య(55) జీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి దేవునిగుట్టతండాకు చెందిన భూక్య నవీన్ బైక్‌పై వచ్చి ఢీకొనడంతో నర్సయ్య అక్కడికక్కడే కింద పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులకు తె లిపి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో తరలించారు. ఈ ప్రమాదంలో నర్సయ్య మెడ భాగం, పక్కటెముకలు, ఒక కాలు విరిగి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కో సం బుధవారం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి, కుమారుడు శివకుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ కోరారు.
హెల్మెట్ లాక్ చేయక తలకు బలమైన గాయం
అక్కడికక్కడే దుర్మరణం


