● కలెక్టర్‌కు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వినతి
కోరుట్లరూరల్: రైతులకు సరిపడా యూరియా ను అందుబాటులో ఉంచాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్ బి.సత్యప్రసాద్‌ను కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. వర్షాకాలం వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్నాయని, సాగుకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతరత్రా ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల విక్రయ కేంద్రాల్లో నిల్వ ఉండేలా వ్యవసాయ యంత్రాగాన్ని సమాయత్తం చేయాలని సూచించారు. దీనిపై ముందస్తు ప్రణాళికతో వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.
సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలి
జగిత్యాలరూరల్: గర్భిణులు సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో జైపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ నిర్వహించారు. ఆరోగ్యకేంద్రాలు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రతినెలా 9న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధారెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుర్దుస్, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో ధర్మపురి వాసికి బంగారు పతకం
ధర్మపురి: ధర్మపురికి చెందిన రంగు విరంచి స్పప్నిక పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించింది. స్వప్నిక సోమవారం చైన్నెలో జరిగిన పవ ర్ లిఫ్టింగ్‌లో ఆలిండియా చాంపియన్ షిప్ పోటీల్లో విజ యం సాధించింది. జేఎన్టీయూ తరఫున పోటీలో పాల్గొని 84 కిలోల విభాగంలో పోటీ పడి స్కౌట్‌లో 275 కిలోలు, బ్రేంచ్‌ఫ్రెస్‌లో 125, డెడ్ లిఫ్ట్‌లో 190 మొత్తం 590 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం సాధించింది.


