● రోగాలకు నిలయం మాదిగకుంట ● టెండర్‌ పూర్తయినా పట్టని అధికారులు | - | Sakshi
Sakshi News home page

● రోగాలకు నిలయం మాదిగకుంట ● టెండర్‌ పూర్తయినా పట్టని అధికారులు

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

● రోగాలకు నిలయం మాదిగకుంట ● టెండర్‌ పూర్తయినా పట్టని అధికారులు

పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో 803 సర్వే నంబరులో 2.39 ఎకరాల్లడ్కీ కుంట విస్తరించి ఉంది. కొంతమంది ఆక్రమణదారులు కబ్జాకు గురి చేయగా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి ఉన్న భూ మిని అన్యాక్రాంతం కాకుండా కుంట చుట్టూ హద్దురాళ్లు పెట్టారు. ప్రస్తుతం అందులో కలుషిత నీరు చేరి పిచ్చిమొక్కలు పెరిగాయి. మరోవైపు రూ. కో ట్లు విలువ చేసే భూమి నిరుపయోగంగా మారుతోంది. ఏటా వర్షకాలంలో పట్టణంలో ఇదే పెద్ద సమస్యగా మారింది. ఇందులో ఉన్న వ్యర్థాల వద్దకు కు క్కలు, పందులు చేరి స్వైర విహారం చేస్తున్నాయి.

ఎక్కడి పనులు అక్కడే

పట్టణ ప్రగతి, పారిశుధ్య కార్యక్రమంలొ భాగంగా స్వయంగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ కుంటను పరిశీలించి మురికినీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ విషయమై మాజీమంత్రి జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ కూడా రాశారు. మాదిగకుంటలోని మురికినీటిని తొలగించేందుకు.. డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

టెండర్‌ పూర్తయినా..

కుంటలోని మురికి నీటిని తొలగించేందుకు రూ.1.50 కోట్లతో డ్రైనేజీ నిర్మాణానికి జనవరిలో టెండర్‌ నిర్వహించారు. ఇందులో కట్టెకోల శ్రీకర్‌ టెండర్‌ దక్కించుకున్నారు. ఆరునెలలు గడుస్తున్నప్పటికీ టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చి కిలోమీటరు మేర డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని బల్దియా ప్రజలు మున్సిపల్‌ పాలకవర్గసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement