రాయికల్: ఎమిరెట్స్ తెలంగాణ సంస్కృతి, సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో దుబాయ్‌లోని అజ్మాన్‌లోగల హ్యాబిటెట్ స్కూల్ ఆడిటోరియంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రకాశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యమకారుల త్యాగఫలమే తెలంగాణ అన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్ మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి గల్ఫ్ సంక్షేమానికి అడుగులు వేయడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫౌండర్ కిరణ్‌కుమార్, మాజీ అధ్యక్షుడు రాదారపు సత్యం, ఉపాధ్యక్షుడు అలిగేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ శేఖర్‌గౌడ్, కోశాధికారి తిరుమల్‌రావు, కల్చరల్ సెక్రటరీ వినోద్‌కుమార్, తెలుగు సంఘాల అధ్యక్షుడు రాజశ్రీనివాస్‌రావు, సమియోద్దీన్, కట్కం రవి, నర్సింహ, ఎస్‌వీఎస్.రెడ్డి పాల్గొన్నారు.


