ఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలోపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి

Jun 8 2026 7:18 AM | Updated on Jun 8 2026 7:18 AM

గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతామని, ఏడాదిలోగా పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. చిల్వకోడూరు పెద్దచెరువు తూ ముకు రూ.7.65లక్షలతో మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.వెయ్యి కోట్లు అవసరం అవుతాయని, మంజూరుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారని తెలిపారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండలకేంద్రంలో పోచమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాపెల్లి గంగ న్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీమా సంతోష్‌, నాయకులు నిశాంత్‌రెడ్డి, దాసరి తిరుపతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement