గోదావరిలో మురుగునీరు కలవకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో మురుగునీరు కలవకుండా చర్యలు

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి: గోదావరిలో మురుగు నీరు కలవకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శనివారం మార్నింగ్‌ వాక్‌ ద్వారా పుష్కరఘాట్లు, వివిధ వార్డుల్లోని డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పుష్కరాలకు నిత్యం వేలాది మంది భక్తులు రానున్నందున వారికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోదావరిలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడతామన్నారు. నది పవిత్రతను కాపాడాలని మున్సిపల్‌ శాఖకు సూచించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ

వెల్గటూర్‌: ఎండపల్లి మండలం కొత్తపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఛత్రపతి గొప్ప యోధుడని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌, అక్కపల్లి ఎత్తిపోతల పథకం, రోళ్లవాగు పూర్తి చేస్తామని వివరించారు. సర్పంచ్‌ జీరెడ్డి మహేందర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సంగ రమేశ్‌, ఎండపల్లి ప్యాక్స్‌ చైర్మన్‌ గూడ రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement