ఒక్క రైతు సాధారణంగా ఒకటి, రెండు పచ్చిరొట్ట విత్తనాల బస్తాలు భూమిలో చల్లుతారు. గతేడాదితో పోల్చితే రైతుపై దాదాపు రూ.2వేల వరకు అదనపు భారం పడుతోంది. పండించే పంటకు విత్తనాల మాదిరిగా రేట్లు పెరగడం లేదు. ప్రభుత్వం ఆలోచించి సబ్సిడీ పెంచి.. రేటు తగ్గించాలి.
– మారు మురళీధర్ రెడ్డి, వెల్లుల్ల, మెట్‌పల్లి
అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
జిల్లాకు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పిస్తున్నాం. ఇక్కడి రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తుంటారు. అందుకే పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సింగిల్ విండో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నాం.
– వడ్డేపల్లి భాస్కర్,
జిల్లా వ్యవసాయాధికారి


