● వద్దన్నా.. కొయ్యకాలు కాల్చినందుకు
కథలాపూర్: మండలంలోని రాజారాంతండాకు చెందిన ఎనిమిది మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున వ్యవసాయ అధికారి జరిమానా విధించారు. పంటల అవశేషాలు కాల్చితే భూసారానికి ముప్పు ఉంటుందని అవగాహన కల్పించినా.. గ్రామానికి చెందిన భూక్యా నంద్యానాయక్, లకావత్ రాములు, లకావత్ భక్చయ్య, భూక్యా సంతోష్, కున్ఫోత్ రాజేశ్, దేగావత్ రాజు, లకావత్ తిరుపతి, బానోత్ రాజు కొయ్యకాలుకు నిప్పు పెట్టడంతో ఏవో యోగితా, సర్పంచ్ తిరుపతి నాయక్ కలిసి జరిమానా విధించినట్లు కార్యదర్శి నరేశ్ తెలిపారు.


