సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

మెట్‌పల్లిరూరల్‌: హిందూ సనాతనధర్మం, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని విశోఖ తీర్థ స్వామిజీ అన్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందూధర్మం విశిష్టత ను తెలుసుకోవాలని సూచించారు. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పుల్ల జగన్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ లక్మ చిన్నయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్‌పాల్‌రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement