జగిత్యాల: భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి సందర్శించారు. ఉదయం అల్పాహారం అందించాలని, భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అల్పాహారం, పోషకాహారం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సంక్షేమాధికారి రాజ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతెలో ఉడుత లక్ష్మీనర్సు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశం చేశారు. సర్పంచ్ మహేశ్, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
గొల్లపల్లి: గొల్లపల్లి మండలం చందోలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, ధాన్యం తూకంలో కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.


