పొరండ్లలో శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన | - | Sakshi
Sakshi News home page

పొరండ్లలో శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

● వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌

● వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌

జగిత్యాలరూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్లలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గురువారం శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్‌, శోభమ్మ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెల్దుర్తి గ్రామంలోని గట్టు మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆమె వెంట నాయకులు ఆనందరావు, సదాశివరావు, మహిపాల్‌రెడ్డి, ప్రవీణ్‌, ప్రకాశ్‌, తిరుపతి పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ చేతన్‌నితిన్‌

జగిత్యాలక్రైం: ఇటీవల ఏఎస్పీగా బదిలీ అయిన చేతన్‌నితిన్‌ గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అశోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ను కలిశారు. 2022 బ్యాచ్‌కు చెందిన చేతన్‌ నితిన్‌ జనగామ ఏఎస్పీగా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement